AP: కలియుగ వైకుంఠం తిరుమలో కుండపోత వర్షం కురిసింది. సుమారు 2 గంటలకు పైగా కురిసిన వర్షంతో శ్రీనివాసుడిని దర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అటు తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.