WGL: రాయపర్తి పోలీస్ స్టేషన్లో నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసుకొని జఫర్ఘడ్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ సింగరపు ఏలీయాను ఘనంగా సన్మానించారు. సోమవారం ఎస్సై ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపి, శుభాకాంక్షలతో వీడ్కోలు పలికారు. సేవా కాలంలో అందించిన సహకారం, క్రమశిక్షణను ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు.