ATP: పెద్దవడుగూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు నాయుడు ఇటీవల గుత్తి రోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు.