MLG: వెంకటాపురం మండలంలోని యాకన్నగూడెం-ఆలుబాక మధ్య గోదావరినదిలో ప్రతిపాదిత డీసిల్టేషన్ పనులను రద్దు చేయాలని CPM నాయకులు సోమవారం ITDA పీవోకు వినతిపత్రం సమర్పించారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు దెబ్బతిని గిరిజనులు, రైతాంగానికి నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించి అనుమతులు నిలిపివేయాలన్నారు.