SRPT: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మండలం యండ్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల గృహప్రవేశానికి హాజరై ప్రారంభించి మాట్లాడారు. గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.