VZM: గుర్ల మండలం గుజ్జంగివలస ఓంశక్తి గోశాల నిర్వాహకుడు రామకృష్ణ పశువుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. పశువుల సంరక్షణలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామన్నారు. నిర్వాహకుడిపై కేసులు నమోదు చేసి, గోశాల అనుమతుల రద్దుకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.