మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో చరణ్ మాస్ లుక్ హైలైట్‌గా నిలవనుంది. కాగా, ఈ చిత్ర విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా, సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.