ELR: కొయ్యలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎమ్మార్వో నాగరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే వాటిని నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.