NGKL: అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నేత శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.