MHBD: మరిపెడ మండలంలోని కాకతీయ కళాతోరణం సమీపంలో అదనపు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల పత్రాల తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పత్రాలను పరిశీలించిన పోలీసులు, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మంగ్య నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.