JGL: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధర్మపురి మండలం జైన, దొంతపూర్ గ్రామాలు, బీర్పూర్ మండల కేంద్రం, తుంగూరు గ్రామాల్లోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, తూకం, రవాణా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.