SDPT: హుస్నాబాద్ మున్సిపాలిటీకి 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అందజేస్తున్న “ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం” లభించడం ఎంతో సంతోషకరమైన విషయమని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం హుస్నాబాద్, సూర్యాపేట మున్సిపాలిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం హుస్నాబాద్ ప్రజలకు గర్వకారణం అన్నారు.