WGL: నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు వరంగల్ రోడ్డులో సర్వే నెం.702 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం జరుగుతోందని బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆరోపించింది. 15 ఏళ్ల క్రితం అప్పటి జాయింట్ కలెక్టర్ వాకిటి కరుణ ఆదేశాలతో నిలిచిన నిర్మాణాన్ని ఇప్పుడు ఎవరి అండతో మళ్లీ ప్రారంభించారని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించాలని అన్నారు.