CTR: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులు, ఇద్దరు హోమ్ గార్డులు, కార్యాలయ క్లర్క్ మే నెలలో పదవీ విరమణ పొందారు. వారిని ఎస్పీ తుషార్ సోమవారం సన్మానించారు. 43 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో అంకితభావంతో విధులు నిర్వహించారని కొనియాడారు. శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఏ అవసరం వచ్చినా శాఖ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.