ASR: జీకేవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ సభ్యుడు బుజ్జిబాబు డిమాండ్ చేశారు. సోమవారం జీకేవీధిలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏ.ధారకొండ నుంచి గొల్లపల్లి వరకు, సప్పర్ల నుంచి గాలికొండ వరకు రహదారి నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ఏ.ధారకొండ, నడిమివీధికి మధ్యలో వెంటనే వంతెన నిర్మించాలని కోరారు.