W.G: విభిన్న ప్రతిభావంతుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్ఎన్-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026న గుంటూరులో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దీనికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. వివరాల కోసం 79016 94488 ఈ నంబరును సంప్రదించాలన్నారు.