సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు బస్సులను పెంచాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గరీమ అగ్రవాల్కు వినతిపత్రం అందజేశారు. రోజు వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రోగులు, సాధారణ ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్నారన్నారు.