AP: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని YCP దుష్ట రాజకీయాలు చేస్తోందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. YCP నేతల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. నంద్యాలలో YSR విగ్రహం కూల్చివేత కుట్రలో TDPని ఇరికించేందుకు YCP కుట్ర చేసిందని ఆరోపించారు.