ADB: ఉట్నూర్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గ్రామాల్లో నష్టాలు వాటిల్లాయి. మండలంలోని హస్నాపూర్ గ్రామ శివారులో ఉన్న విద్యుత్ స్థంబాల తీగలు రోడ్డుపై తెగ పడడంతో రాకపోకలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి త్వరలో మరమ్మతులు చేసి కరెంటు సరఫరాలో యధావిధిగా సాగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.