AP: పల్స్ సర్వే తరహాలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్ల కార్యాచరణ చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్నుల వసూళ్ల విషయంలో ముందుకెళ్లాలని, దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ మాట్లాడతానని అధికారులకు పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే రూ.5,400 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని వెల్లడించారు.