VSP: విశాఖను AI, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, 6 గిగావాట్ల డేటా సెంటర్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాబిన్ ఖుదా హామీ ఇచ్చారు.