KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరి స్వామి దేవస్థాన ఈవోగా వీ. వెంకన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఆయన ఈ ఆలయానికి నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా దేవస్థాన అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని వెంకన్న తెలిపారు.