AP: ఐదేళ్లలో YCP ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా DSC నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే.. YCP నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. అందుకే DSC నిర్వహణపై YCP నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి YCP నేతలకు ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు.