ఫిఫా వరల్డ్కప్ జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీ భారత ప్రసార హక్కులను ‘జీ నెట్వర్క్’ దక్కించుకుంది. రాబోయే 8 ఏళ్ల పాటు ఫిఫా నిర్వహించే అన్ని ఈవెంట్ల ప్రసార హక్కులను జీ సొంతం చేసుకుంది. కాగా, ఈ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో 48 దేశాల జట్లు పాల్గొంటుండగా.. భారత్ మాత్రం ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.