TG: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రేపు 3, అలాగే ఈ నెలలో 5 నుంచి 6 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు TGPSC ఛైర్మన్ వెంకటేశం వెల్లడించారు. ఇక నుంచి ప్రతి నెల 3 నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని చెప్పారు. 3800 పోస్టులు విడుదల అవుతాయని.. వీటిల్లో 1,393 బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయన్నారు. సీబీటీ విధానంలోనే పరీక్షలు ఉంటాయని తెలిపారు.