MNCL: ఈనెల 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల డీఎంహెచ్వో డాక్టర్ అనిత తెలిపారు. సోమవారం డయేరియా నివారణపై అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ప్రతి గ్రామంలో వోఆర్ఎస్ జింక్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి డయేరియా నివారణపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.