TPT: మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్.రెడ్డయ్య సోమవారం కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో మత్స్యశాఖ అభివృద్ధి కార్యక్రమాలు, చేపల పెంపకం, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు సమాచారం.