PLD: ఎడ్లపాడు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 10 కిలోల జీలుగ/జనుము లేదా 8 కిలోల పిల్లి పెసర చొప్పున పంపిణీ చేస్తున్నామని ఏవో ఏ. హరిప్రసాద్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.