KMM: సత్తుపల్లి పట్టణంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం, దోబీ ఘాట్ భవన నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.