MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా రీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ ద్వారా పెన్షన్ చెల్లింపుల్లో పారదర్శకత, కచ్చితత్వం మెరుగుపడుతుందని తెలిపారు. లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీలోపు రీవెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులుకోరారు.