MLG: ఏటూరునాగారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు సోమవారం ఐటిడీఏ ప్రాజెక్ట్ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామాల నుంచి పొలాలు, స్మశానవాటికలకు వెళ్లే రహదారులను మెటల్, సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. వర్షాకాలంలో రైతులు ఎరువులు, పంటల రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.