MNCL: జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఐటీఐ కళాశాలలో వెల్డర్, కోపా, డ్రెస్ మేకింగ్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. మే 25 నుంచి ప్రారంభమైన అడ్మిషన్లు జూన్ 8తో ముగుస్తాయన్నారు.