సత్యసాయి: పెనుకొండలో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత పోలీసులను సోమవారం ఆదేశించారు. మహిళల భద్రత, యువత భవిష్యత్తు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. లాడ్జీలు, అద్దె గృహాల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.