E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం కార్యాలయంలో సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం MLA మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన టీడీపీ శ్రేణులతో కలిసి పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.