BPT: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. సాగునీటి కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరారు.