KMM: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు సమస్యలతో కూడిన వినితీ పత్రం అందించారు. ప్రభుత్వ మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.