TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక జనప్రియ మార్వెల్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో దేవుడికి వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అర్పివేశారు. ప్రమాదంలో ఆస్తినష్టం మినహా ప్రాణనష్టం ఏమీ లేదని పోలీసులు తెలిపారు.