NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో ఆయిల్ పామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నామని రైతులు పేర్కొంటూ, వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.