MDK: కౌడిపల్లి మండలం తునికి శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చిన ఈ పూజా కార్యక్రమాల్లో, ఆలయ పూజారి శివప్ప భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.