MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఐటీఐలో “ప్రజాభద్రత-పోలీసు బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. సురక్ష పోలీస్ కళా బృందం, ఏహెచ్టీయూ, షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు లింగ వివక్ష, ఈవ్ టీజింగ్ నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ఇంటర్నెట్ భద్రత, బాల్య వివాహాల నివారణ గురించి వివరించారు.