సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బొంతలపల్లికి చెందిన 35 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. బొంతలపల్లి సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.