MLG: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఉదయం 8.30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్లు కోరారు.