KNR: జమ్మికుంట పట్టణంలో తాగునీటి కొరత నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పలు వార్డుల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట ట్యాంకర్లను పంపిస్తున్నారు.