WG: టీడీపీ నిర్వహించిన మహానాడు మాజీ సీఎం జగన్ నామస్మరణతోనే మారుమోగిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత విమర్శించారు. సోమవారం పాలకొల్లులో ఆమె మాట్లాడుతూ.. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అనడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వివరించారు.