SRCL: ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జీ. జ్యోతి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన గణేష్ బదిలీపై వెళ్లడంతో ఆమె నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నారు.