MDCL: కాప్రా సర్కిల్లోని అశోక్ నగర్-నెహ్రు నగర్ ప్రధాన రహదారి వద్ద హైటెన్షన్ విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు తాకుతూ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. గాలులు, వర్షాల సమయంలో షార్ట్‌సర్క్యూట్, విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే కొమ్మలను తొలగించాలని విద్యుత్ శాఖను కోరుతున్నారు.