PDPL: ఎలిగేడు మండలం రేకల్దేవుపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆయన ఇవాళ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలోని ప్రభుత్వ భూములపై సమగ్ర వివరాలు సిద్ధం చేసి, నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.