KMR: కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి EHSకి 1.5 శాతం కోత విధించడం అన్యాయమని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా వేతనాల్లోంచి కోత పెట్టడం సరికాదన్నారు.