జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద జగిత్యాల, ధర్మారం వెళ్లే ఇరువైపులా టీజీఎస్ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించాలంటూ గ్రామానికి చెందిన కోడిపెల్లి రంజిత్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. బస్టాండ్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఎండ, వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.