RR: పెండింగ్ బిల్లుల విడుదల కోసం సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధమైన మాజీ సర్పంచులను చౌదరి గూడలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తమ సొంత డబ్బుతో గ్రామాభివృద్ధి చేశామని, బిల్లులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమని సంఘం నేత బాబురావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం హరిస్తోందని ఆయన ఆరోపించారు.